టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ)-2026కు సంబంధించి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్లలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తామని డీఈవో డాక్టర్ సలీంబాషా తెలిపారు. అభ్యర్థులు www.bseap.org వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్టాల్ బాలికోన్నత పాఠశాలలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు, హిందూ కాలేజీ హైస్కూల్లో డ్రాయింగ్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.