మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే రాజ్యాంగబద్ధంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్ లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైకాపా నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.