గుంటూరు నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మోతీలాల్ నగర్‌లో 60 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చివేయాలన్న ఎమ్మెల్యే నసీర్ నిర్ణయంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇళ్లను తొలగిస్తామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. జేసీబీలతో వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన వారు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి
లోకేశ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.