సస్పెన్షన్‌లోనే ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ రిటైర్

1588చూసినవారు
సస్పెన్షన్‌లోనే ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ రిటైర్
సస్పెన్షన్‌లో ఉన్న 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ ఈ నెల 30 మధ్యాహ్నం నుంచి పదవీ విరమణ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై కొనసాగుతున్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ విచారణల ఫలితాలకు అనుగుణంగానే పెన్షన్‌తో పాటు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు అమలు చేయనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్