నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 16న డీఆర్డీఏ-వెలుగు కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి. విజయలక్ష్మి తెలిపారు. ఈ మేళాలో రెండు ప్రైవేట్ సంస్థల్లో జూనియర్ కెమిస్ట్, జూనియర్ టెక్నికల్ అప్రెంటిస్, మెషిన్ ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బీకాం, బీఎస్సీ, ఎంఎస్సీ, బి. టెక్ విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు అర్హులు. అర్హులు తమ విద్యా ధ్రువపత్రాలు, రేషన్, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో నేరుగా హాజరు కావాలని సూచించారు.