మిర్చి యార్డ్ డైరెక్టర్ల నియామకం: ఎమ్మెల్యే నసీర్‌కు కృతజ్ఞతలు

496చూసినవారు
మిర్చి యార్డ్ డైరెక్టర్ల నియామకం: ఎమ్మెల్యే నసీర్‌కు కృతజ్ఞతలు
గుంటూరు మిర్చి యార్డ్ AMC డైరెక్టర్లుగా సత్యనారాయణ, మూడవత్ మంగాబాయి, మహమ్మద్ హఫీజ్ నియమితులయ్యారు. వీరు గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, తమ నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేయాలని, రైతులు, అధికారుల మధ్య సమన్వయం పెంచి మిర్చి యార్డ్ అభివృద్ధికి తోడ్పడుతూ మెరుగైన పరిపాలన అందించాలని ఎమ్మెల్యే నసీర్ డైరెక్టర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్