గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ బుధవారం పర్యటించి, వినోబా నగర్ లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, కాల్వల పూడిక తీయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నసీర్ ప్రజలకు హామీ ఇచ్చారు.