ఏఈ ఉద్యోగాల భర్తీ 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

1568చూసినవారు
ఏఈ ఉద్యోగాల భర్తీ 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 60 అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్‌లో 3, టెలికం విభాగంలో 1 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించారు. బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్