మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

280చూసినవారు
మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
తెనాలి పట్టణంలోని 32వ వార్డు ఎడ్ల కాలనీలో శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు నెలకు రూ.15 వేల పెన్షన్ అందిస్తూ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 63 లక్షల మందికి రూ.2,700 కోట్ల రూపాయలను సంక్షేమ పెన్షన్ల రూపంలో ప్రభుత్వం అందజేస్తోందని వెల్లడించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్