రామాపురం బీచ్‌లో యువకుడి గల్లంతు అప్రమత్తమై కాపాడిన పోలీసులు

1514చూసినవారు
రామాపురం బీచ్‌లో యువకుడి గల్లంతు అప్రమత్తమై కాపాడిన పోలీసులు
గుంటూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు శనివారం చీరాల మండలం రామాపురం బీచ్‌లో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా, సముద్రపు అలల తాకిడికి లోతైన ప్రాంతానికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్నేహితుల కేకలకు స్పందించిన పోలీసులు వెంటనే సముద్రంలోకి దూకి, యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసుల అప్రమత్తతను అక్కడి ప్రజలు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్