ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు అందజేసిన అర్జీలను పరిశీలించిన ఆయన, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. సంక్లిష్టమైన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.