అమరావతిపై తీర్మానం సరే.. కానీ..: షర్మిల

240చూసినవారు
అమరావతిపై తీర్మానం సరే.. కానీ..: షర్మిల
రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్వాగతించారు. అయితే, విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. కేవలం అప్పుల కోసం రాజీపడకుండా, రాజధాని నిర్మాణానికి అవసరమైన లక్ష కోట్ల రూపాయలను కేంద్రమే భరించాలని షర్మిల డిమాండ్ చేశారు. మోదీ ఇచ్చిన 'చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి'తోనే సరిపెట్టుకుంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్