శ్రీ చిదంబరం చిత్రం: యువతకు స్ఫూర్తినిచ్చే సందేశం

285చూసినవారు
శ్రీ చిదంబరం చిత్రం: యువతకు స్ఫూర్తినిచ్చే సందేశం
నూతన నటీనటులు వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీ చిదంబరం'. ఫిబ్రవరి 6న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా చిత్ర బృందం వివిఐటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో హీరో వంశీ తుమ్మల, హీరోయిన్ సంధ్య వశిష్ట, దర్శకుడు వినయ్ రత్నం, వివిఐటియూ రిజిస్ట్రార్ డా. వై. మల్లికార్జున రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ ఈ చిత్రం యువతలో స్ఫూర్తిని నింపేలా సాగుతుందని, మనలోని లోపమే మన బలమనే సందేశాన్ని ఇస్తుందని అన్నారు. చిన్న సమస్యలకే ఆత్మహత్యల వరకు వెళ్లే యువతకు ఈ చిత్రం మంచి సందేశం అందిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్