పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో, ప్రకాశ్‌రావు అనే వ్యక్తికి రూ. 22 లక్షలు చెల్లించినప్పటికీ, పొలం పత్రాల విషయంలో తనను వేధిస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.