ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ఇద్దరికి గాయాలు

594చూసినవారు
ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ఇద్దరికి గాయాలు
వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డుపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బ్రాహ్మణపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్