తిరుమల లడ్డూపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం

494చూసినవారు
తిరుమల లడ్డూపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం
జగన్‌ను హిందువులకు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై కుట్రపూరిత ప్రచారం చేస్తోందని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, లడ్డూలో జంతువుల కొవ్వు లేదని ల్యాబ్ నివేదికల్లో తేలినా, చంద్రబాబు, పవన్, లోకేశ్ ఇంకా అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే పవిత్ర ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్