అంబటి రాంబాబు అరెస్ట్ వార్తతో వైసీపీ శ్రేణుల ఆందోళన

619చూసినవారు
అంబటి రాంబాబు అరెస్ట్ వార్తతో వైసీపీ శ్రేణుల ఆందోళన
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద శనివారం అర్ధరాత్రి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఉంచారని, ఆయనకు ఏమైనా హాని జరిగితే సహించేది లేదని హెచ్చరిస్తూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో ఎస్పీ కార్యాలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్