గుంటూరులో 30 పోలీసు చట్టం అమలులో ఉందని డీఎస్పీ అరవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.