గుంటూరు మిర్చియార్డులో బాల కార్మికుల గుర్తింపు

490చూసినవారు
గుంటూరు మిర్చియార్డులో బాల కార్మికుల గుర్తింపు
గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మిర్చియార్డు పరిధిలో కార్మిక శాఖ అధికారులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఇద్దరు బాల కార్మికులను గుర్తించి వారిని పనుల నుంచి విముక్తి కల్పించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్