గుంటూరులో ఈనెల 9, 10న తాగునీటి సరఫరాకు అంతరాయం

587చూసినవారు
గుంటూరులో ఈనెల 9, 10న తాగునీటి సరఫరాకు అంతరాయం
గుంటూరు నగరంలో ఈ నెల 9, 10 తేదీలలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నీటిని పంపింగ్ చేసే పైప్ లైను సీతానగర్ వద్ద లీకేజ్ అవ్వడంతో ఈ సమస్య తలెత్తింది. నెహ్రూనగర్, శారదాకాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీనగర్, హనుమయ్య నగర్, స్తంభాలగరువు, శామలానగర్, గుజ్జనగుళ్ల, కొరిటెపాడు, ఏటీ అగ్రహారం, తారాకరానగర్ వంటి ప్రాంతాలలో నీటి సరఫరా నిలిచిపోతుందని GMC కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్