గుంటూరు: నేడు కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ

326చూసినవారు
గుంటూరు: నేడు కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ
కలెక్టరేట్లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో సోమవారం పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీల స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, మీకోసం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ తో పాటు రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్