గుంటూరు: ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలి

532చూసినవారు
గుంటూరు: ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 2019-24 వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని, సుప్రీంకోర్టు నియమించిన సిట్ దీనిని నిర్ధారించిందని తెలిపారు. ఈ నెయ్యిని శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించడం వల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్