మాజీ మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు హుందాగా వ్యవహరించకుండా నోటికొచ్చినట్లు దూషణలకు దిగడం మంచిది కాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం గుంటూరులో విలేకర్లతో అన్నారు. అంబటి, జోగి రమేష్‌లు నీచ రాజకీయాలు చేస్తున్నారని, అధికారంలో ఉన్నవారు తీరు మార్చుకోవాలని, ప్రతిపక్షం రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆయన హితవు పలికారు. అంబటి ఇంటి ముందు జరిగిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.