గుంటూరు: నేడు నగరానికి జగన్ రాక

1322చూసినవారు
గుంటూరు: నేడు నగరానికి జగన్ రాక
వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరు నగరానికి రానున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, 11 గంటలకు అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తన నివాసానికి పయనమవుతారు.

సంబంధిత పోస్ట్