గుంటూరు: మాదక ద్రవ్యాలు వద్దు బ్రో...

580చూసినవారు
గుంటూరు: మాదక ద్రవ్యాలు వద్దు బ్రో...
గుంటూరు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత జీవితాలు, కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్