గుంటూరు: నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

1348చూసినవారు
గుంటూరు: నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం
లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ, డీఈఈలు పీహెచ్. ఖాన్, ఎన్. గురవయ్యలు తెలిపారు. డీ-8 సెక్షన్ పరిధిలోని పండరీపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే, బాలాజీనగర్ ఫీడర్ పరిధిలో లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 7 నుంచి 12 గంటల వరకు శ్రీకృష్ణనగర్, బూరెలవారివీధి, సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డు, కృష్ణుడి కల్యాణ మండపం రోడ్డు, యాదవుల బజార్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ పి. రమేష్బాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్