గురువారం గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. జగన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అధ్యక్షతన ఎన్టీఆర్ స్టేడియం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవస్థానాల పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆపాలని నినాదాలు చేశారు.