గుంటూరు: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

1104చూసినవారు
గుంటూరు: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి
జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. గుంటూరు ఛానల్ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి మొదటి విడతలో భూ యజమానులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్