ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కూటమి నాయకులు

364చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కూటమి నాయకులు
పిడుగురాళ్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి తెల్లవారుజాము నుండే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. అన్న మాట ప్రకారమే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేస్తున్నామని కూటమి నాయకులు ముప్పన వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు అమీర్ అలీ అన్నారు. బయోమెట్రిక్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఈ పెన్షన్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్