కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఎం. రమేష్‌పై జరిగిన దాడిని MRPS పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జి మాదిగ తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్‌తో గుద్ది, రాడ్లతో దాడి చేసిన నిందితులపై తక్షణమే నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం అలసత్వం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.