ఉక్కపోతకు చెక్.. దాచేపల్లిలో కురిసిన వాన

2405చూసినవారు
దాచేపల్లిలో శనివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి మోస్తరు వర్షం కురిసింది. రోజంతా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు రాత్రి వీచిన చల్లటి గాలులు, వర్షం ఉపశమనం కలిగించాయి. కొద్దిసేపు కురిసిన వర్షంతో రహదారులు తడిసిముద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న వేడి నుంచి ప్రజలు ఊరట పొందారు. చల్లని వాతావరణాన్ని పలువురు ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్