రేషన్ దుకాణాల్లో స్టాక్ పరిశీలించిన సివిల్ సప్లై డిటి

913చూసినవారు
రేషన్ దుకాణాల్లో స్టాక్ పరిశీలించిన సివిల్ సప్లై డిటి
మాచవరం మండలంలోని పలు రేషన్ దుకాణాలను బుధవారం రాత్రి సివిల్ సప్లై డిటి కీర్తి సుధా స్రవంతి తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను, లబ్ధిదారులకు అందజేస్తున్న రేషన్లను ఆమె పరిశీలించారు. రేషన్ షాపులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తెరిచి ఉంచాలని సూచించారు. గంగిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మి పోతురాజు రేషన్ షాపును కూడా ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యారా సి నరేంద్ర, కళ్ళం అప్పారావు, వీఆర్ఏలు పాల్గొన్నారు.