మాచవరం మండలం సింగరాయపాలెం తండా సమీపంలోని పీల్లేరు వాగులో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల మేతకు వెళ్లిన రెండు మేకలను మొసలి చంపి తినిందని కాపరులు తెలిపారు. ఈ వాగు వద్దకు నిత్యం వందలాది మేకలు, గొర్రెలు, ఇతర పశువులు నీటిని తాగేందుకు వస్తుంటాయని, దీంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.