గురజాల ప్రభుత్వ వైద్యశాలలో అగ్నిమాపక భద్రతా శిక్షణ

435చూసినవారు
గురజాల ప్రభుత్వ వైద్యశాలలో గురువారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల అగ్నిమాపక కార్యాలయ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ఫైర్ సేఫ్టీ పరికరాల వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆసుపత్రులు, పాఠశాలలు, సినిమా థియేటర్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పరికరాలను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రజా ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో ముందు జాగ్రత్తలు, సిద్ధతలు కీలకమని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ గురజాల ఆసుపత్రిలో జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్