గురజాల: శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించిన ఎమ్మెల్యే

349చూసినవారు
గురజాల: శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించిన ఎమ్మెల్యే
గురజాల నియోజకవర్గంలోని శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, దైద, సారంగపల్లి, మొర్జంపాడు, గుత్తికొండ, గోగులపాడు క్షేత్రాలకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్