మల్లవోలులో నరసింహ స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే యరపతినేని హాజరు

288చూసినవారు
మల్లవోలులో నరసింహ స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే యరపతినేని హాజరు
మాచవరం మండలం మల్లవోలు గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి 33వ వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, స్వామివారి దర్శనం చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్లవోలు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులందరూ కలిసి ఈ కళ్యాణ వేడుకలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లవోలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్