ఆరోగ్య దర్శిని: బాల్య వివాహాలు, వ్యాధుల నివారణపై కలెక్టర్ ఆదేశాలు

390చూసినవారు
ఆరోగ్య దర్శిని: బాల్య వివాహాలు, వ్యాధుల నివారణపై కలెక్టర్ ఆదేశాలు
కారంపూడి మండలం మిరియాల గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పి. మస్తాన్ వలి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అధికారి CH. నాగేశ్వరావు వైద్య సేవలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, పరిశుభ్రతపై ప్రసంగించారు. పి. మస్తాన్ వలి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు జాగ్రత్తలు వివరించారు. ప్రతి నెలా మొదటి గురువారం ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ కృతిక ఆదేశించారు. ఈ కార్యక్రమం పల్నాడు, గురజాల, నరసరావుపేట ప్రాంతాలలో వైద్య సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్