పల్నాడు జిల్లా మాచవరంలో బట్టల వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ. కోటి విలువైన బంగారు నగలను అపహరించారు. వెండి వస్తువులను వదిలేసి బంగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.