నరసరావుపేట నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో రేపు, అనగా 15వ తేదీన జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా, కోటప్పకొండ హిందూ మాదిగల అన్నదాన సత్రం వ్యవస్థాపకులు B.V విజ్ఞేశ్వర స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్‌ను ఈరోజు విడుదల చేశారు. రాష్ట్రంలోని మాదిగ, మాదిగ ఉపకులాలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల నగేష్ మాదిగ, కోట సుబ్బు మాదిగ, కందుల జార్జి మాదిగ, గద్దల ఏసుదాసు మాదిగ, లక్కీ పోగు సాగర్ మాదిగ, పచ్చి గొల్ల రవిచంద్ర మాదిగ తదితరులు పాల్గొన్నారు.