దాచేపల్లిలో లారీల ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తిరుపతి రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీని, తంగెడ వైపు నుంచి వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే తిరుపతి రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
