మాచవరంలో మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం

490చూసినవారు
మాచవరంలో మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం
గురజాల మండలం మాచవరంలో కిరాణా మర్చంట్ బజార్లో వివిధ గ్రామాల నుండి వచ్చే బాటసారులకు, స్థానికులకు మినరల్ వాటర్ కూలింగ్ చలివేంద్రాన్ని నిర్వాహకులు సూర్య నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. గత 30 సంవత్సరాలకు పైగా ఈ చలివేంద్రాన్ని సూ రే వెంకటసుబ్బారావు కుమారుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ చలివేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్