మాచవరం మండలం పిల్లుట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పశువుల యజమానులకు ఎమ్మెల్యే మందులు పంపిణీ చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పాల సేకరణ స్టీల్ క్యాన్లను కూడా పంపిణీ చేశారు.