కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి అర్జీలను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.