పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్నంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్న మాట ప్రకారమే, నెల మొదటి తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా కొత్త పెన్షన్లు కూడా అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.