గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పిడుగురాళ్ల పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుకలకు హాజరయ్యారు. పల్నాడు ప్రాంతం, కొరసాల నియోజకవర్గం వెంకటేశ్వర స్వామి దయతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల పిడుగురాళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించామని, ఈ దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కుటమి నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.