పల్నాడు: వరద ఉద్ధృతి.. పడవపై ప్రజల ప్రయాణం

2చూసినవారు
కృష్ణ, మూసీ నదుల ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోని మత్స్యకారుల కాలనీ ముంపునకు గురైంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నదులు పొంగిపొర్లడంతో, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దాచేపల్లి తహశీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అర్ధరాత్రి వేళ వేగంగా స్పందించి, మత్స్యకారుల కాలనీని ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్