పిడుగురాళ్లలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ముగ్గురు మహిళల కళ్లల్లో కారం కొట్టి వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న మహిళలు కేకలువేయడంతో ఒక మహిళ మెడలోంచి సగం చైన్ లాక్కొని పరారయ్యాడు. వాకింగ్ చేస్తున్న మహిళలే లక్ష్యంగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.