పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే

6చూసినవారు
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహిస్తుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాలేజీని అప్గ్రేడ్ చేయడంతో పాటు, పోస్టుల కేటాయింపు పూర్తయిందని, ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేశ్, మంత్రి సత్య కుమార్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.