పిడుగురాళ్ల పట్టణంలో వివాహిత చెరుకూరి మరియమ్మ ముక్కును ప్రియుడు కంపా వెంకట్రావు, అతని తమ్ముడు నగేష్ కలిసి కోడికత్తితో కోసిన ఘటనలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరి మధ్య నాలుగు నెలల క్రితం గొడవలు రావడంతో విడిపోయారు. ఈ నెల 22న మరియమ్మ నిద్రపోతున్న సమయంలో వెంకట్రావు, నగేష్ కలిసి ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో మరియమ్మ ముక్కు తెగిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ ఎస్.వెంకట్రావు తెలిపారు.