గురజాల శాసనసభ్యులు రపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ 27వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 27వ వార్డు ఇన్చార్జి కుంచపు గంగరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరస్వామి, సాధికార సమితి సభ్యులు వేముల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ దేవుళ్ళ రాంబాబు,
జనసేన మండల కార్యదర్శి జి కొండ కిరణ్ కుమార్, ఏఎన్ఎం సుజాత, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.